"జాతిరత్నాలు" సినిమాతో గతేడాది టాలీవుడ్ రంగప్రవేశం చేసిన యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా నటించి మెప్పించిన ఫరియా ఆపై తెలుగులో ఫుల్ లెంగ్త్ సినిమాలు చెయ్యలేదు. బంగార్రాజు లో స్పెషల్ సాంగ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో స్పెషల్ రోల్ లో కనిపించి మెప్పించింది. ఆపై కోలీవుడ్ లో జెండా పాతేందుకు చెన్నై వెళ్ళిపోయింది.
"బిచ్చగాడు" ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న "వల్లి మాయిల్" సినిమాలో ఫరియా ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది. ఈ సినిమాకు సుశీంథిరన్ డైరెక్టర్. గత నెల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సత్యరాజ్, భారతీరాజా కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు ఫరియా బర్త్ డే కావడంతో వల్లి మాయిల్ మూవీ టీం స్పెషల్ బర్త్ డే ట్రీట్ ను ప్లాన్ చేసింది. ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలను తెలుపుతూ మూవీ నుండి ఫరియా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో పాతకాలపు డాన్సర్లు వేసుకునే కాస్ట్యూమ్స్ లో ఫరియా చాలా ముద్దుగా ఉంది. పోతే, ఈ పోస్టర్ ను బట్టి తెలుస్తున్నదేంటంటే, ఈ మూవీ 1980ల బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.