ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య - గోపీచంద్ మూవీ వచ్చేది అప్పుడే... !

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 06:59 PM

గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమా కావడంతో NBK#107 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని NBK 107 మూవీ టీం అద్భుతమైన టీజర్ ను, పోస్టర్ ను రిలీజ్ చేసింది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగులకు, యాక్షన్ ప్యాక్డ్ సీన్లకు నందమూరి అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. తమన్ మ్యూజిక్ బాలయ్య మాస్ అవతార్ ను మరింత ఎలివేట్ చేసేలా ఉంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ పై లేటెస్ట్ బజ్ ఏంటంటే, ముందుగా అనుకున్న ప్రకారం దసరాకు కాకుండా డిసెంబర్ 23న ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్యపై హై ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com