బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నుండి ఈ ఏడాది బ్రహ్మాస్త్ర అనే బిగ్ బడ్జెట్ మూవీ రాబోతుంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మోడరన్ మైథలాజికల్ మూవీలో రణ్ బీర్, ఆలియా కలిసి నటించారు. ఈ మూవీ కన్నా ముందే రణ్ బీర్ "షంషేరా" అనే బిగ్ టాస్క్ ను ఎదుర్కోనున్నాడు.
కరణ్ మల్హోత్రా డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం "షంషేరా". యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై యాభైవ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. 2018లో స్టార్ట్ ఐన ఈ మూవీ 2019లోనే రిలీజ్ కావలసి ఉంది. కరోనా మరియు ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతుండడంతో రిలీజ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు జూలై 22న, హిందీ, తెలుగు, తమిళ భాషలలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.
ఇదిలాఉంటే, ఈ మూవీ నుండి రణ్ బీర్ లుక్ కు సంబంధించిన ఒక పోస్టర్ లీకై నిన్నా మొన్నా మీడియాలో హల్చల్ చేసింది. ఇదే పోస్టర్ ను తాజాగా మేకర్స్ అధికారికంగా విడుదల చేసారు. భయంకరమైన యోధుడు, తన జాతిని కాపాడుకొనే ఏకైక రక్షకుడు పేరిట విడుదల చేసిన ఈ పోస్టర్ లో రణ్ బీర్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. జులపాల జుట్టు, గుబురు గడ్డం, చేతిలో పెద్ద గొడ్డలి పట్టుకుని అచ్చు ఒక డకాయిట్ లా కనిపిస్తున్నాడు. లవర్ బాయ్ లా హ్యాండ్సమ్ గా ఉండే రణ్ బీర్ ను ఈ గెటప్ లో చూడాలంటే ఆయన అభిమానులకు కాస్త కష్టమే. కానీ ఈ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.