ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ లో అప్రతిష్ట మూటకట్టుకున్న నాని బ్లాక్ బస్టర్ హిట్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 05:37 PM

నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం  మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA). 2017లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పాతిక కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ దాదాపు డెబ్బై కోట్లకు పైగా వసూలు చేసి, నిర్మాతలకు అధిక లాభాలను తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని "నికమ్మ" పేరుతో హిందీలో రీమేక్ చేసారు. ఇందులో సీనియర్ నటి భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దస్సాని, షెర్లీ సెటియా జంటగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భూమిక పోషించిన పాత్రలో నటించింది. షబ్బీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటెర్నేషనల్ ప్రొడక్షన్ తో కలిసి షబ్బీర్ ఖాన్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ మూవీకి విమర్శకుల నుండి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమా పట్ల అంతగా ఆసక్తిని చూపించకపోవడం వల్ల మొదటి రోజు ఈ సినిమాకు కేవలం పాతిక లక్షల కలెక్షన్లే వచ్చాయట. రీసెంట్గా విడుదలైన ఏ హిందీ చిత్రానికి కూడా ఇలాంటి గతి పట్టలేదు. నాని కెరీర్లో పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచిన MCA కు బాలీవుడ్ లో ఇలాంటి దీనస్థితి పట్టడం నిజంగా బాధాకరం. అయినా, యూట్యూబు లో MCA డబ్బింగ్ వెర్షన్ కు మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చిన తర్వాత తిరిగి ఆ సినిమాను రీమేక్ చెయ్యడంలో దర్శకనిర్మాతల ఆంతర్యమేంటో?వారికే తెలియాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com