ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లీకైన పోస్టర్ లో గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో గెటప్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 03:53 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నుండి ఈ ఏడాది బ్రహ్మాస్త్ర అనే బిగ్ బడ్జెట్ మూవీ రాబోతుంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మోడరన్ మైథలాజికల్ మూవీలో రణ్ బీర్, ఆలియా కలిసి నటించారు. ఈ మూవీ కన్నా ముందే రణ్ బీర్ "షంషేరా" అనే బిగ్ టాస్క్ ను ఎదుర్కోనున్నాడు.
కరణ్ మల్హోత్రా డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం షంషేరా. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. 2018లో స్టార్ట్ ఐన ఈ మూవీ 2019లోనే రిలీజ్ కావలసి ఉంది. కరోనా మరియు ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతుండడంతో రిలీజ్ కూడా ఆలస్యమవుతూ వస్తుంది. జూలై 22న షంషేరా మూవీని థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ మూవీకి సంబంధించిన చిన్న అప్డేట్ ను కూడా మేకర్స్ రివీల్ చెయ్యలేదు. ఇదిలాఉంటే, ఈ మూవీ నుండి రణ్ బీర్ లుక్ కు సంబంధించిన ఒక పోస్టర్ లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో రణ్ బీర్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. జులపాల జుట్టు, గుబురు గడ్డం, చేతిలో పెద్ద గొడ్డలి పట్టుకుని అచ్చు ఒక డకాయిట్ లా కనిపిస్తున్నాడు. లవర్ బాయ్ లా హ్యాండ్సమ్ గా ఉండే రణ్ బీర్ ను ఈ గెటప్ లో చూడాలంటే ఆయన అభిమానులకు కాస్త కష్టమే. కానీ ఈ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. లీకైన ఈ పోస్టర్ పై షంషేరా మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి స్పందనను తెలియచేయలేదు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com