కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బీస్ట్ చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును అధికారికంగా ఇటీవలే ప్రకటించారు కూడా. తాజాగా ఈ మూవీకి "జైలర్"అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఆగస్టులో మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ చిత్రంలో శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కెరీర్ పరంగా రజినీకిది 169వ సినిమా. తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, జైలర్ సినిమా అచ్చు నెల్సన్ గత చిత్రం బీస్ట్ లానే ఉండనుందట.
నెల్సన్ దిలీప్ కుమార్ హీరో విజయ్ తో చేసిన చిత్రం బీస్ట్. ఇంటర్నేషనల్ టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం ఒక షాపింగ్ మాల్ లో జరుగుతుంది. ఇదే స్ట్రాటజీని నెల్సన్ రజినీ సినిమాకు కూడా అప్లై చెయ్యబోతున్నాడు. జైలర్ టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమా మొత్తాన్ని ఒక అంధకార జైలులో చిత్రీకరించడానికి చిత్రబృందం సిద్ధమైందట. ఐతే, మూవీ నేపధ్యమేమిటి ? ఇందులో రజిని జైలర్ గా కనిపిస్తాడా? లేక ఖైదీలానా ? అన్నది ఇంటరెస్టింగ్ గా మారింది. మరి ఈ కాన్సెప్ట్ లైన్ ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.