ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్లీవేజ్ అందాలతో జాన్వీ కపూర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 02:38 PM

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ  అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 


ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. స్కై బ్లూ కలర్ అతుకుల డ్రెస్ లో జాన్వీ ఫోటో షూట్ చేసింది. పాలరాతితో చెక్కిన శిల్పం లాగా జాన్వీ కపూర్ అందంతో మెరిసిపోతోంది. కళ్ళు చెదిరేలా ఉన్న జాన్వీ అందాల అలజడికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com