ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆశక్తికరంగా 'హిట్: ఫస్ట్ కేస్' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 01:41 PM

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'హిట్-ది ఫస్ట్ కేస్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిందీలో కూడా అదే టైటిల్‌తో రీమేక్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించారు. గ్లామర్ బ్యూటీ సన్యా మల్హోత్రా ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావుకి జంటగా నటించారు. ఈ రీమేక్‌కు కూడా శైలేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 15,2022న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను అధికారికంగా విడుదల చేశారు. టీజర్ ఆసక్తికరంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో రోహన్ సింగ్, షాను కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రాఫర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, భూషణ్ కుమార్ మరియు కులదీప్ రాథోడ్ నిర్మించారు. ఈ చిత్రానికి మనన్ భరద్వాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com