ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" మూవీ నుంచి 'వెన్నెల్లో హాయ్ హాయ్' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 01:04 PM

హాయ్ హాయ్ హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి

వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్ హాయిగుంటె చాలునండి
వెయ్యిమాటలెందుకండి
కనుల ఎదుట కలల ఫలము
నిలిచినది తందానా సుధ చిందేనా
కలలు కనని వనిత ఎవరో మనకు
ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలీ

మధుర లలనా మదన కొలనా
కమల వదనా అమల సదనా
వదల తరమా మదికి వశమా చిలిపితనమా
చిత్రమైన బంధమాయె అంతలోన
అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా

వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్
జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్ హాయిగుంటె చాలునండి
వెయ్యిమాటలెందుకండి

గదిని సగము పంచుకుంది
ఎవరు అనుకోవాలీ ఏం కావాలీ
మదిని బరువు పెంచుకుంటూ
ఎవరికేం చెప్పాలీ ఏం చెయ్యాలీ
అసలు తను ఎల్లా ఉందో
ఏం చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడా
మనకేముందీ మామూలే

కళలు తెలుసా ఏమో బహుశా
కవిత మనిషా కలల హంస
మనసు కొంచం తెలుసుకుంది
కలిసిపోయె మనిషిలాగ
మంచి పద్ధతంటు ఉంది
మదిని లాగుతున్నదీ
ఎంత ఎంత వింతగున్నదీ

వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి

వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్
హాయ్ రామా హాయ్
హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com