రాధికా ఆప్టే... మోస్ట్ ట్యాలెంటెడ్ అండ్ బోల్డ్ హీరోయిన్. తన మనసులో ఏమనిపిస్తే అది ముక్కుసూటిగా, నిక్కచ్చిగా బయటకు చెప్పేసే నిష్కల్మషమైన హృదయం గల హీరోయిన్. తెలుగులో ఆర్జీవీ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర, బాలయ్య సరసన లెజెండ్, లయన్ సినిమాలలో నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని గతంలో రాధికా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఫిలిం ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయట పెట్టడంలో ఎప్పుడూ ముందుడే, రాధికా ఇటీవల కాస్మొటిక్ సర్జరీ చేయించుకునే హీరోయిన్లను ఎద్దేవా చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి ఇండస్ట్రీ డార్క్ సైడ్ గురించి రాధికా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పెద్ద ఆకారంలో, ఆకర్షణీయమైన పెదాలు తనకు లేవని కారణం చెప్తూ ఒక బిగ్ ప్రాజెక్ట్ నుండి తప్పించారని రాధికా ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ప్లేసులో మరో గ్లామర్ హీరోయిన్ ను, సెక్సీ ఫిగర్ ఉన్న బ్యూటీ ని మేకర్స్ తీసుకున్నారని ఆమె చెప్పింది. ఐతే, ఆ సినిమా ఏంటి? మేకర్స్ ఎవరు? అనే విషయంపై రాధికా సమాచారమివ్వలేదు.