ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హార్ట్ ఆఫ్ స్టోన్' లో అలియా భట్ ఈ పాత్రలో కనిపించనుందా?

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:52 PM

RRR, గంగూబాయ్ కతియావాడి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ ప్రస్తుతం తన తొలి హాలీవుడ్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. స్పై థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి టామ్ హార్పర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలియా నటిస్తున్న తన తొలి హాలీవుడ్ సినిమా 'హార్ట్ ఆఫ్ స్టోన్' లో వండర్ వుమన్ నటి గాల్ గాడోట్ మరియు జామీ డోర్నన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో బ్యూటీ అలియా మాయా సింగ్ అనే ఇండో-అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో మూవీ మేకర్స్ వెల్లడి చేయనున్నారు. ఈ సినిమాని స్కైడాన్స్ మీడియా నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com