ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన దుల్కర్ 'సీతా రామం'

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:45 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాళిని ఠాకూర్ లేడీ లవ్ కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం యువతి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి 'సీత రామం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో సుమంత్ అక్కినేని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, సీతా రామం సినిమా ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com