ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగరంగ వైభవంగా విక్రమ్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్... ఎప్పుడంటే?

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:33 PM

ఏ భాష చిత్రాలు ఆ భాషలో రిలీజ్ అవ్వడం కామనే. రీసెంట్ గా ఒక భాష చిత్రాలు వేరే భాషల్లో కూడా విడుదలై విజయవంతమవుతున్నాయి. ఆయా చిత్రబృందాలు తమ సినిమాకు తమ భాషలోనే ప్రచారం చేసి ఊరుకోకుండా, మిగిలిన భాషల్లో కూడా భారీగా ప్రోమోట్ చేసి గ్రాండ్ సక్సెస్ ను అందుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో, అక్కడి మెట్రో నగరాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి అక్కడి ప్రేక్షకుల్లో మంచి బజ్ ను తీసుకొచ్చారు. 


తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా కూడా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోనుంది. అందుకోసం విక్రమ్ తెలుగు హక్కులను చేజిక్కించుకున్న హీరో నితిన్ సొంత బ్యానరైన శ్రేష్ట్ మూవీస్ అధినేత రెడ్డి స్వయంగా చెన్నై వెళ్లి కమల్ ను ఆహ్వానించారట. తెలుగులో కూడా విక్రమ్ సినిమాకు తగినంత ప్రొమోషన్ చేసి సినిమాను విజయవంతం చెయ్యాలని ఆయన కమల్ ను రిక్వెస్ట్ చేశారట. దీంతో కమల్ అండ్ టీం హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కు హాజరై విక్రమ్ సినిమాకు తెలుగులో కూడా ప్రచారాన్ని చెయ్యనున్నారు. అయితే, ఈ కార్యక్రమం ఎప్పుడన్నది ఇంకా తేదీ ఖరారు కాలేదు. జూన్ 3న ఈ మూవీ విడుదల కాబోతుంది కాబట్టి ఈలోపే తమిళ, తెలుగు భాషలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగనున్నాయి. 


విక్రమ్ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com