నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలోనే వినోదభరిత చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి సినిమా చెయ్యనున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో కలిసి NBK#107 సినిమా చేస్తూ బాలయ్య చాలా బిజీగా ఉన్నారు. ఇటు, అనిల్ రావిపూడి కూడా ఎఫ్ 3 ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. ప్రొమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ తన తదుపరి చిత్రంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇప్పటికే బాలయ్యతో చేసే సినిమాకు సంబంధించి చాలా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి మరొక ఇంటరెస్టింగ్ న్యూస్ ను రివీల్ చేసారు. అదేంటంటే... రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు ఓటిటి విన్నర్ గా నిలిచిన బిందుమాధవి కి బాలయ్య సినిమాలో అవకాశం ఇస్తున్నట్టు అనిల్ తెలిపారు.
బిందుమాధవి తన సినీ కెరీర్ ను తెలుగులోనే మొదలుపెట్టినప్పటికీ ఇక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో మకాం తమిళనాడుకు మార్చేసింది. అక్కడ చాలా సినిమాల్లో నటించిన బిందు కు సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష లాగానే మిగిలింది. తాజాగా తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలి లేడీ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి అదృష్టం ఇప్పుడిప్పుడే తలుపుతట్టడం మొదలెట్టింది. తాజాగా బాలయ్య సినిమాలో అవకాశం బిందుకు వచ్చిందంటే, ఫ్యూచర్ లో మరిన్ని క్రేజీ ఆఫర్లు దారిలో ఉన్నట్టే.