సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం ఈ మూవీ టీమ్ మనాలిలో కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ ఆక్షన్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |