ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్ 3'లో టర్నింగ్ పాయింట్ గా మిల్కీ బ్యూటీ పాత్ర

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:27 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా మే 27, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోందని, ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం. ఈమె ద్వారా సినిమాలోని ఒక కీలక ట్విస్ట్ బయటకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com