ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్‌' లో సూర్య పాత్ర షాకింగ్‌గా ఉంటుంది - లోకేష్ కానగరాజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:09 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో డైరెక్టర్ లోకేష్ కంగరాజ్ సూర్య పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలని వెల్లడించాడు. ఇప్పటివరకు కనిపించని పాత్రలో సూర్య ఈ సినిమాలో కనిపిస్తారు. విక్రమ్ సినిమాలో ఫుల్ ఇంటెన్స్ గా కనిపించనున్నారు అంటూ వెల్లడించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విక్రమ్' సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com