అలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'డార్లింగ్స్'. ఈ చిత్రానికి జస్మీత్ కెరీన్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై గౌరీ ఖాన్, అలియా భట్ మరియు గౌరవ్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ కామెడీ డ్రామా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది.త్వరలో నెట్ ఫిక్స్ లో సీమింగ్ కానుంది. ఈ మేరకు అప్ డేట్స్ ఇస్తూ..చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. చాలా సరదాగా రూపొందించిన ఈ వీడియోలో డార్లింగ్స్ నెట్ ఫిక్స్ లో వస్తుందని చెప్పడానికి.. చాలా ఊరించారు.