ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"జాను" మూవీ నుంచి 'ది లైఫ్ ఆఫ్ రామ్' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 12:05 PM

"జాను" మూవీ నుంచి 'ది లైఫ్ ఆఫ్ రామ్' పాట లిరిక్స్:
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా

ఏం చూస్తూ ఉన్నా.. నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా, తృటి లో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా

ఇల్లాగే కడ దాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా

నా వెంట పడి నువ్వింత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇప్పుడే నను కనగా
అనగనగా.. అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక.. తుది లేని కథ నేను గా

గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగా

యే చిరునామా లేక.. యే బదులు పొందని లేఖ..
ఎందుకు వేస్తోందో కేక.. మౌనంగా


లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా
విన్నారా..
నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా

అమ్మ ఒడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి
అంత దూరానున్నా.. వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com