ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలపతి విజయ్ తదుపరి సినిమాకి దర్శకత్వం వహించనున్న లోకేష్ కనగరాజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:11 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విక్రమ్' సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ తలపతి విజయ్‌తో మరొక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జరిగిన ఒక అవార్డు వేడుకలో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లితో 'తలపతి 66' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జనవరి 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com