ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం నుండి తప్పుకున్న ఇద్దరు నటులు

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 02:58 PM

ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్‌ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జంటగా కనిపించనుంది. 'కభీ ఈద్ కభీ దివాళీ' అనే టైటిల్ ని ఈ మూవీకి మేకర్స్ లాక్ చేసారు. ఈ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ ప్రొడక్షన్ హౌస్‌తో విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు జహీర్ ఇక్బాల్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి వీరిద్దరి నుంచి ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ముంబైలోని విలే పార్లేలోని గోల్డెన్ టుబాకో ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com