అందాల తార అదితీరావ్ హైదరీ తన పర్సనాలిటీ, నాలెడ్జ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కేన్స్ ఫెస్టివల్ లో అందాలు ఆరబోస్తున్న నటి.. ఐదో రోజు రెడ్ కార్పెట్ పై నడిచి అట్రాక్ట్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... కేన్స్ రెడ్ కార్పెట్ కు డ్రెస్ సెలక్షన్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యానని చెప్పింది. చివరగా సబ్యసాచి డిజైన్ చేసిన రెడ్ అండ్ పింక్ గౌన్లో దర్శనమి చ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే 'నేను పొట్టిగా ఉన్నందుకు కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొంటున్న జిరాఫీలతో పోటీపడలేక పోయాను. అయినా నేనేం బాధపడట్లేదు. నా పర్స నాలిటీ విషయంలో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. ఆ ధైర్యంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను' అంటూ చెప్పుకొచ్చింది. అదృష్టం కొద్దీ ఈ ఫెస్టివల్ లో ఎలాంటి తెలివితక్కువ పని చేయలేదని వెల్లడించింది. ఒకవేళ చేసినా జనాల విమర్శల నుంచి మరింత నేర్చుకునే దాన్నని పేర్కొంది.