ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా రివ్యూ: 'సర్కారు వారి పాట'

cinema |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 11:59 AM

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్  "సర్కారు వారి పాట". ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులతో పాటు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈరోజు అత్యధిక థియేటర్లలో సినిమా విడుదలైంది.


అమెరికాలో మ‌హేశ్‌ ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. త‌న ద‌గ్గ‌ర అప్పు తీసుకున్న‌ వాళ్ల నుంచి వ‌డ్డీతో స‌హా వ‌సూలు చేయ‌నిదే వ‌దిలిపెట్ట‌డు. అమెరికాలోనే చ‌దువు కోసమ‌ని వెళ్లిన క‌ళావ‌తి (కీర్తి సురేష్‌) మ‌ద్యానికి, జూదానికి బానిసగా మారుతుంది. మ‌హేశ్‌ ద‌గ్గ‌ర అబ‌ద్ధాలు చెప్పి అప్పు చేస్తుంది. ఎవ్వ‌రికీ సుల‌భంగా అప్పు ఇవ్వ‌ని మ‌హేశ్‌ తొలి చూపులోనే క‌ళావ‌తిపై మ‌న‌సుప‌డి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కళావ‌తి అస‌లు రూపం మ‌హేశ్‌ తెలియగానే అప్పు త‌న‌కి తిరిగిచ్చేయ‌మ‌ని అడుగుతాడు. ఆమె తీర్చ‌న‌ని చెప్పేస‌రికి విశాఖ‌ప‌ట్నంలో ఉన్న క‌ళావ‌తి తండ్రి రాజేంద్ర‌నాథ్ (సముద్ర‌ఖ‌ని) ద‌గ్గ‌రికి వస్తాడు. రాజేంద్ర‌నాథ్ త‌న‌కి 10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంద‌ని చెబుతాడు. ఆ 10 వేల కోట్ల క‌థేమిటి? అంత డ‌బ్బుని వ‌సూలు చేసుకున్నాడా? మ‌హేశ్‌ గ‌తం ఏమిటి? అనే విష‌యాలు సినిమా చూస్తే తెలుస్తాయి.


పాట‌లు, ఫైట్లు, కామెడీతో ఫస్ట్ హాఫ్ స‌ర‌దా సర‌దాగా సాగిపోతుంది. కళావతిగా కీర్తి సురేష్ బాగా నటించి ఆకట్టుకుంది. అప్పు వసూలు చేయ‌డం కోసం మ‌హేశ్‌ ఇండియాకి బ‌య‌ల్దేర‌డం దగ్గరి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సినిమాలో చాలా సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయి. మ‌హేశ్‌ బాబు స్టైల్ లో మాస్ అంశాల్ని ఎక్కువ‌గా జోడించి ద‌ర్శ‌కుడు మ‌ధ్య‌లో తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పారు. స్క్రీన్ ప్లే ప‌రంగా ఎలాంటి మ్యాజిక్ క‌నిపించ‌దు. సెకండ్ హాఫ్ దాదాపుగా ప్రేక్ష‌కుడు ముందే ఊహించగలుగుతాడు. మ‌హేశ్‌, కళావతిల మ‌ధ్య సీన్స్ ఫస్ట్ హాఫ్ లో కామెడీని పండించాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఫ్యాన్స్ కి న‌చ్చే అంశాలు మాత్రం సినిమాలో చాలా ఉన్నాయి. క‌ళావ‌తి, మ మ మ‌హేషా పాటలు సినిమాకి హైలైట్‌ గా చెప్పుకోవచ్చు. మ‌హేశ్‌బాబు త‌న టైమింగ్‌ తో మెప్పిస్తారు. కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. త‌మ‌న్ పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప‌ర్వాలేద‌నిపిస్తాయి. డైరెక్టర్ ప‌ర‌శురామ్ త‌న ర‌చ‌న‌లో బ‌లం కంటే కూడా మ‌హేశ్‌లోని స్టార్ బ‌లాన్నే ఎక్కువ‌గా నమ్మినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో కామెడీ
- హీరో హీరోయిన్ల నటన, వారి మధ్య కెమిస్ట్రీ
- బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ నేప‌థ్యం
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- లాజిక్‌ కి అంద‌ని సీన్స్
రేటింగ్: 2.75/5. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com