ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" మూవీ నుంచి 'అటు ఇటు ఊగుతూ' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 09:10 AM

"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" మూవీ నుంచి 'అటు ఇటు ఊగుతూ' సాంగ్ లిరిక్స్: 
అటు ఇటు ఊగుతూ
అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది
మనసుకేమయింది

చకచక దూకుతూ
తడబడి తుళ్లుతూ
తలపుని తరుముతోంది
వయసుకేమయింది

నీ వలనే ఇదిలా మొదలయిందే
నా మాటే వినదే… ప్రేమాయే
నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకు… ఏ మాయే
నా వెంటే ఉంటావు… నీలా మారే వరకు

అటు ఇటు ఊగుతూ
అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది
మనసుకేమయిందే

జాబిలికి జలుబును తెచ్చే చలువ నీదే
సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే
మేఘమును మెలికలు తిప్పే మెరుపు నీవే
కాలముని కలలతో నింపే కథవి నీవే

మౌనం నీ భాషయితే
చిరునవ్వే కవితౌతోందే
నీ కనుల కావ్యాన్నే
చదివేయమన్నదే
నీ వలనే ఇదిలా ఔతోందే

నా మాటే వినదే… ప్రేమాయే
నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకు… ప్రేమాయే
నా వెంటే ఉంటావు..నీలా మారే వరకు

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది

మాములుగా అనిపిస్తుందే నువ్వు వస్తే
మాయమని తెలిసొస్తుందే లోతు చూస్తే
మంటవలె వెలుగిస్తావే దూరముంటే
మంచువలె లాలిస్తావే చేరువైతే

విరబూసే పువ్వైనా
మరునాడే చూస్తది అందం
నువు పూస్తే నూరేళ్లూ విరిసేను జీవితం
నీ వలనే ఇదిలా జరిగిందే

నా మాటే వినదే… ప్రేమాయే
నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకు… ఏ మాయే
నా వెంటే ఉంటావు… నీలా మారే వరకు

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com