చిత్రం : బీస్ట్
నటీనటులు: విజయ్-పూజా హెగ్డే-షైన్ టామ్ చాకో-సెల్వ రాఘవన్-పృథ్వీ-యోగిబాబు-రెడిన్ కింగ్స్లీ-అపర్ణా దాస్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
మాటలు: హనుమాన్ చౌదరి
నిర్మాత: కళానిధి మారన్ (తెలుగు రిలీజ్: దిల్ రాజు)
రచన-దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
ఉగ్రవాద నేపథ్యంలో యాక్షన్ మైండ్ గేమ్ డ్రామాతో వచ్చిన బీస్ట్ మూవీలో 'రా' ఏజెంట్గా విజయ్ నటన బాగుంది. ఎంట్రీ అదిరిపోయింది. పూజా హెగ్డే పాత్ర బలంగా అనిపించదు. రెగ్యులర్ మూవీలా లాజిక్స్ లేకుండా సాగింది. సీరియస్ స్టోరీ కామెడీతో పట్టాలు తప్పింది. దర్శకుడు నెల్సన్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా తెరకెక్కించినా ల్యాగ్ సీన్స్ ఎక్కువయ్యాయి. అరబిక్ కుతూ సాంగ్, బీజీఎమ్ బాగుంది.
రేటింగ్ 2/5