ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RC15' సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 12:33 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేయడానికి వచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. జనతా గ్యారేజ్‌, మనమంతా  సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ చేసిన ఈ సీనియర్ స్టార్ హీరో మలయాళంలో ఫుల్ బిజీ అయ్యాడు. ఇటీవల విడుదలైన OTT సినిమా 'బ్రో డాడీ' కూడా మంచి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న'RC15' సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com