ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జునకి జోడీగా అమలాపాల్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 23, 2021, 10:46 AM

కాజల్‌ స్థానాన్ని భర్తీ చేయనుంది మరో కథానాయిక అమలాపాల్‌. 'ది ఘోస్ట్‌' సినిమాలో నాగార్జునకి జోడీగా అమలాపాల్‌ ఎంపికైనట్టు తెలుస్తోంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా 'ది ఘోస్ట్‌' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. మొదట ఈ సినిమాలో నాగ్‌కి జోడీగా కాజల్‌ ఎంపికైన విషయం తెలిసిందే. ఆ ఇద్దరిపై కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. ఇంతలో కథానాయిక కాజల్‌ గర్భం దాల్చడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. దాంతో ఆమె స్థానంలో మరో సీనియర్‌ కథానాయిక అమలాపాల్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. ఈ తరహా సినిమాల్ని థ్రిల్లింగ్‌గా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు ప్రవీణ్‌ సత్తారు. దర్శకుడిగా ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. 'ది ఘోస్ట్‌'కి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించింది. గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com