సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ అని టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అన్నారు. విజయవాడలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో క్రీడల అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని కుంబ్లే కొనియాడారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని కోరిన స్పిన్ మాంత్రికుడు… క్రీడలు మానసిక వికాసాన్ని, క్రమశిక్షణను నేర్పుతాయని అన్నారు.