ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిమాని అభిలషించాడు...చిరంజీవి అభిమాని ఇంట ప్రత్యక్షమయ్యారు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 07:27 PM

చిరంజీవి అంటే అభిమానులకు ఎంత ఇష్టమో తనను అభిమానించే అభిమానులు అంటే చిరుకు కూడా అంతే ఇష్టం. అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రదర్శించే ఆపేక్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, తన సొంతూరు మొగల్తూరుకు చెందిన ఓ అభిమాని చివరికోర్కె తీర్చారు. ఆ అభిమాని పేరు నాగరాజు. నాగరాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. తన చివరికోర్కెగా తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని కలవాలనుందని మనసులో మాట వెల్లడించాడు. 


ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి నాగరాజును తన నివాసానికి ఆహ్వానించారు. మృత్యువుతో పోరాడుతున్న తన వీరాభిమానిని చూసి చలించిపోయారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నాగరాజును పరామర్శించారు. దాదాపు గంటపాటు ఆ అభిమానితో ముచ్చటించారు. అతడిలో మానసిక స్థైర్యం కలిగించడమే కాదు, ఆర్థికసాయం కూడా అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com