ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంధనశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కర్తవ్య బోధ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 12:14 AM

విజయవాడ, సూర్య బ్యూరో : ``రాష్ర్టంలో రెండున్నరేళ్ళ కిందటి కరెంటు కష్టాల గుర్తులు ఇంకా తొలగి పోలేదు. ఇప్పడు రాష్ర్టంలో మిగులు విద్యుత్తు ఉంది. మారుమూల గిరిజన తాండాల్లోను విద్యుత్తును అందిస్తూ అందరికీ విద్యుత్తు పథకం అమలులో దేశంలోనే ముందున్నాం. పరిశ్రమలకు కోరినంత విద్యుత్తును అందిస్తున్నాం, పంటలకూ ఏడు గంటల పాటు పగటి పూటే నిరంతరాయంగా కరెంటును ఇస్తున్నాం. గతంలో కరెంటు సరఫరా లేకపోవడంతో బోర్లు పని చేయక నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండేది, ఇప్పడా పరిస్థితి లేదు. అవసరమైనప్పడు వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు 24 గంటలు విద్యుత్తును అందించాం. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో సమర్థవంతమైన యాజమాన్య విధానాలతో విద్యుత్తు పంపిణీ, ప్రసార, ఉత్పత్తి సంస్థలను లాభాల బాటను పట్టించండి. గతంలో విద్యుత్తు కోసం డిస్కంలపై పూర్తిగా ఆధారపడే వారు. కాని. పెద్ద సంస్థలు , సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాయి. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహం ఇస్తుండటంతో ప్రైవేటు సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. బయట పవర్‌ ఎక్సేంజిలోనూ విద్యుత్తు లభిస్తోంది. ఇలాంటి తరుణంలో మిగులు విద్యుత్తును సామకులంగా మలుచుకొని ఎప్పటికప్పుడు ఆంతర్గత సామర్థా్యలను పెంచుకుంటూ జెన్కో, ట్రాన్‌‌సకో, డిస్కంలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ వినియోగదారులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును అందుబాటు ధరలో అందించేలా కార్యాచరణను రూపొందించండి'' అని ఇంథనశాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్తవ్య బోధ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తు రంగంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఈ రంగంలో దాదాపు అన్ని అంశాల్లో దేశంలోనే మనం ముందున్నాం. మరీ ముఖ్యంగా సోలార్‌, విద్యుత్తు పొదుపు అంశాల్లో అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అయ్యాం. ఇక ప్రపంచంతోనే పోటీపడాలి అని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్తు ఛార్జీల సవరణ నిమిత్తం ఈ నెల 27 నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఇంథన నియం్తణ్ర సంస్థ (ఏపిఈఆర్‌సి) జిల్లాల వారీగా వినియోగదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్న నేపధ్యంలో ఆదివారం ఇంధన శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్సులో ఇంధన శాఖ ముఖ్య కార్యదరి ఆజయ్‌జైన్‌, ట్రాన్‌‌సకో సీయండీ, జెన్కో ఎండి కె.విజయానంద్‌, ఇంధన శాఖ సలహాదారు కె.రంగనాధం, ట్రాన్‌‌సకో జీయండీలు దినేష్‌ పరుచూరి, ఉమాపతిలు డిస్కమ్‌ల సీఎండీలు ఎం.ఎం.నాయక్‌, హెచ్‌.వైదొర, మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఆజయ్‌ జైన్‌ కాన్ఫరెన్సు వివరాలను వెల్లడించారు. రాష్ర్టంలో ప్రజానీకానికి నిరంతరాయంగా 24 గంటలూ విద్యుత్తు అందిస్తూ, అందుబాటు ధరలో, భరించే స్థాయిలో ఛార్టీల సవరణ ఉండేలా చర్యలు చేపట్టాలని ఇంథన శాఖ ఆధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సులభతర సరళి వాణిజ్య విధానం అమలు చేస్తూ. కోరిన వెంటనే అనుమతులు, భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందించాలని, కరెంట్‌ సరఫరాలో ఒక్క నిమిషం ఫైతం అంతరాయం లేకుండా చూడాలని, అప్పడే పారిశ్రామికాభివద్ధికి బాగా దోహదం చేసినవాళ్ళమవుతామన్న విషయాన్ని గ్రహించాలని సీఎం చంద్రబాబు సష్టం చేశారు. 2014 వరకూ అధికారికంగా పవర్‌ హాలిడే ప్రకటించడంతో లక్షలాది చిన్న, మధ్య తరహా యూనిట్లు మూతప డడంతో, అంతే స్థాయిలో కుటుంబాలు వీధిన పడిన విషయాన్ని గుర్తుంచు కోవాలని అన్నారు. ఆ సమయంలో రాష్ర్టంలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు ఎంత విముఖత చూపే వారో గుర్తుంచుకోవాలన్నారు, నాడు-నేడు పేరిట 2014కు ముందు ఆ తర్వాత కరెంట్‌ సరఫరా పరిస్థితులు-కరెంట్‌ ఛార్టీలు-మరీ ముఖ్యంగా 2014కు ముందు ఫియల్‌ సర్‌ ఛార్‌‌ట అడ్జెస్‌‌టమెంట్‌ (ఎఫ్‌.యస్‌.ఏ) పేరిట ప్రజలపై పెను భారం మోపిన ఉదంతాలను సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏసి రెగ్యులేటరీ కమీషన్‌-పబ్లిక్‌ హియరింగ్‌‌స సందర్బంగా విద్యుత్‌ సంస్థల అధికారులు ప్రజలకు పూసగుచ్చినట్లు  రాష్ర్టంలో గత రెండేళ్ళుగా విద్యుత్తు ఛార్టీల సవరణ ప్రక్రియ హేతుబద్ధంగా చేస్తున్నామని, దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నింటికంటే. రాష్ర్టంలోనే సగటున విద్యుత్తు ఛార్టీలు తక్కువగా ఉన్నాయని ట్రాన్‌‌సకో సీఎండీ, జెన్కో ఎండీ కె.విజయానంద్‌ వివరించారు. ఆందువల్లే ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దష్టికి ఆయన తీసుకువచ్చారు, సామాన్యులపై భారం పడకుండా, అధిక విద్యుత్తును వినియోగించే పారిశ్రామిక వర్గాలకు వీలున్నంతమేరకు ఇబ్బందులు లేకుండా అనువైన సమతుల్యబారిఫ్‌ విధానాన్ని రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా ఇచ్చారు. ఈ సందరేంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విద్యుత్తు సగటు టారిఫ్‌, అంతర్గత సామర్థా్యలను అజయ్‌ జైన్‌ ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ర్టంలో విద్యుత్తు సంస్థలు అంతర్గత సామర్ధా్యలను పెంచుకోవాలంటూ పంపిణీ, సరఫరా నష్టాలను తగ్గించుకుంటున్నందునే. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే సగటున తక్కువ ధరకు విద్యుత్తును అందిస్తున్నామని అజయ్‌ జైన్‌ ప్రకటన విడుదల చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com