ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాటి మనిషిలా స్పందించిన...శభాష్ అనిపించుకొన్న రాహుల్ గాంధీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:18 AM

సామాన్యులతో  కలసిమెలసి తిరగడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంచి అలవాటుగా ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆదుకున్నారు. నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని తాను బస చేసిన హోటల్ కు వెళుతుండగా, మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని రాహుల్ గాంధీ గమనించారు. ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా, ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే తన వాహనం నుంచి దిగిన రాహుల్ గాంధీ బాధితుడి పరిస్థితిని అంచనా వేశారు. వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ ను రప్పించి ఆ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ తీసుకున్నారు. బాధితుడికి ప్రథమచికిత్స చేసిన అనంతరం ఆ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ మానవతా దృక్పథంపై నెటిజన్ల నుంచి అభినందల జల్లు కురుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com