శాన్ ఫ్రాన్సిస్కో: ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడ డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించారు. శాన్ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తున్న నారా లోకేశ్ .. డ్రైవర్ లేకుండా ప్రయాణించే కారులో ఓ ట్రిప్ వేశారు. మరోవైపు గూగూల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకున్నది. విశాఖపట్టణంలో డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఎక్స్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్.. గూగుల్‌కు చెందిన డ్రైవర్‌లెస్ కారులో కాసేపు విహరించారు.