పెరుగు లేకుంటే భోజనం అసంపూర్ణమే, అసంతృప్తి గానే భోజనం దగ్గర నుండి లేవాల్సొస్తుంది. మన తెలుగు వారు పెరుగుకు బానిసలని చెప్పొచ్చు. పెరుగు. ఒక్క రుచికి, మాత్రమే కాదు దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలుసు. అయితే, అవి ఎలాంటి ప్రయోజనాలు అన్నది క్లారిటీ ఉండదు. అలాంటివారు కింద పేర్కొన్న కొన్ని పెరుగు ప్రయోజనాలను తెలుసుకోవచ్చు.
--- కప్పు పెరుగులో కొద్దిగా నల్ల మిరియాల పొడిని కలిపి తింటే, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
--- పెరుగులో తేనె కలిపి తీసుకుంటే అల్సర్ వ్యాధి మాయమైపోతుంది. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి.
--- పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
--- పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
--- కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.