మన దేశంలోని కాలుష్యం ప్రజల ప్రాణాలు హరించేదిగా మారుతోంది. కాలుష్య నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్దచూపడంలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కానీ తెరచాటున కాలుష్యం తన విష కొరలు చాచుతోంది. ఫలితంగా కాలుష్యం కోరల్లో చిక్కి భారత్‌లో ఒక ఏడాది (2019)లోనే 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ‘లాన్సెట్’ అధ్యయనం వెల్లడించింది. భారత్‌లో వాయు కాలుష్యం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో 16.7 లక్షల కాలుష్య మరణాలకు ఇదే కారణమని లాన్సెట్ స్పష్టంచేసింది.
![]() |
![]() |