ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎంహెచ్వోలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 02:12 PM

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (డీఎంహెచ్వో విశాఖపట్నం).. ఒప్పంద ప్రాతిపదికన పీడియాట్రీషియన్, గైనకాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులభర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. టీవీ 9 కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. నోటిఫికేషన్ కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మొత్తం ఖాళీల సంఖ్య: 131 పోస్టుల వివరాలు: పీడియాట్రీషియన్, గైనకాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టులు, ఆడియోమెట్రీషియన్, మెడికల్ ఆఫీసర్, కౌన్సెలర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ తదితర పోస్టులు వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ, డిగ్రీ, ఎంఏ, ఎంబీబీఎసస్, సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.


ఎంపిక విధానం: అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్: డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, విశాఖపట్నం, ఏపీ. దరఖాస్తులకు చివరి తేదీ: మే 21, 2022.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com