ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోచివేలి గౌహతి+ కోచివేలి రెండు ప్రత్యేక రైళ్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:19 AM

 విజయవాడ, సూర్యప్రతినిధి: సాంకేతిక కారణాల దృష్టా్య ముందుగా ప్రకటించిన కోచివేలి గౌహతి కోచివేలి ప్రత్యేక రైళ్లను ఈ నెల 26, మార్చి 1వ తేదీన రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్‌‌జ పీఆర్వో జేవీఆర్‌కే రాజశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 వ తేదీన రావాల్సిన కోచివేలిగువాహటి నంబరు 06336 ప్రత్యేక రైలును, అలాగే నంబర్‌ 06335 గౌహతి-కోచివేలి ప్రత్యేక రైలు మార్చి1వ తేదీను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రాజశేఖర్‌ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com