ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు జగన్నాథ్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు హాజరయ్యే ఏపీ ప్రతినిధి బృందానికి జగనే నేతృత్వం వహించనున్నారు.పర్యటన కోసం ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందిన సీఎం జగన్ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.సాయంత్రం 6 గంటలకు ఆయన జ్యూరిచ్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరిన జగన్ బృందం శుక్రవారం రాత్రి 8.30 గంటలకు దావోస్ చేరుకుంటుంది. సీఎం జగన్ 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండనున్నారు.