ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో 15మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమంకు ఎల్వీకే రంగారావు.. ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్ బాబు.. ఏసీబీ డీఐజీగా పి హెచ్ డి .రామకృష్ణ, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.. ట్రైనింగ్ డీఐజీగా కేవీ మోహన్ రావు.. గ్రైహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి.. న్యాయవ్యవహారాల ఐజీపీగా అదనపు బాధ్యతలు. కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్ గానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీ.. గుంతకల్ రైల్వే ఎస్పీగా అజిత వేజెండ్ల..
రంపచోడవరం ఏఎస్పీగా జీ కృష్ణకాంత్.. చిత్తూరు అడిషనల్ అడ్మిన్ ఎస్పీగా పీ జగదీష్.. పాడేరు అడిషనల్ అడ్మిన్ ఎస్పీగా తుహీన్ సిన్హా.. పల్నాడు అడిషన్ అడ్మిన్ ఎస్పీగా బిందు మాధవ్.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా రవికుమార్‌లు బదిలీ అయ్యారు.
ఎస్ .హరికృష్ణ ను కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా అదనపు బాద్యతలు అప్పగించారు. కోయప్రవీణ్‌ను 16 బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ అయ్యారు. డి ఉదయభాస్కర్‌ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. పి. అనిల్ బాబును పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయగా.. డి.ఎన్ .మహేష్‌ను కూడా పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.
![]() |
![]() |