ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా ప్రధాని జిన్‌పింగ్ పదవి పై కరోనా ప్రభావం..ప్రధానిగా లీ కీక్వాంగ్

international |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 10:16 PM

తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త అంతర్జాతీయ రాజకీయాలలో కాక పుట్టిస్తోంది. చైనా ప్రధాని జిన్‌పింగ్‌పై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. జిన్‌పింగ్ తన పదవి నుంచి వైదొలగవచ్చని చైనా సోషల్ మీడియాలో రూమర్లు హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. ఆ క్రమంలో కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిన్‌పింగ్ కఠినమైన జీరో కోవిడ్ విధానాన్ని అవలభించారు. అయితే విస్తృతమైన లాక్‌డౌన్‌లతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దాంతో ఆర్థిక వృద్ధి కుంటుపడింది. ఈ క్రమంలోనే దేశ ప్రధానిగా జిన్‌పింగ్ విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ క్రమంలోనే చైనాను పాలించే అధికార పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత జింగ్‌పింగ్ పదవీ విరమణ గురించి పుకార్లు బయటకు వచ్చాయి. కోవిడ్ వైరస్ కట్టడిలో జిన్‌పింగ్ విఫలమయ్యారని, దాంతో ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి.


ఈ క్రమంలో కెనడా దేశానికి చెందిన ఓ బ్లాగర్ చేసిన వీడియో చైనాలో ట్రెండ్ అవుతుంది. ఆ బ్లాగర్ జిన్‌పింగ్‌ను పక్కనపెట్టనున్నట్టు వీడియోలో చెప్పారు. జిన్‌పింగ్ తప్పుకోవడమే కాదు.. అతని స్థానంలో ప్రస్తుతం ప్రధానిగా లీ కీక్వాంగ్ బాధ్యతలు చేపడతారని కూడా తెలిపారు. ఇక పార్టీని ప్రభుత్వాన్ని కూడా ఆయనే నడిపిస్తారని కూడా పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com