ఇస్లామాబాద్ : ఇస్లామిక్ నిరసనకారుల డిమాండ్‌కు తలొగ్గిన పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి జాహిద్ హమీద్ తన పదవికి రాజీనామా చేశారు. దేశాన్ని సంక్లిష్ట పరిస్థితినుంచి తప్పించడానికి న్యాయశాఖ మంత్రి రాజీనామా చేశారని ప్రభుత్వ ప్రసార సాధనం పిటివి వార్త ప్రసారం చేసింది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు హమీద్ చెప్పారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ నిరసనకారుల డిమాండ్లలో హమీద్ రాజీనామా ఒకటి. వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో వివిధ మతపరమైన పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకు రావాలని ఇస్లామిక్ నిరసనకారులు యత్నిస్తున్నారు.