తిరువనంతపురం: నటుడు ప్రకాశ్‌రాజ్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. భారదేశ పౌరునిగా ప్రతాప్‌సింహా చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత జీవితాన్ని కుదిపేశాయని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ప్రతాప్ సింహా చేసిన వ్యాఖ్యలపై న్యాయబద్దంగా తనకు సమాధానమివ్వాలని..లేకుంటే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు. ప్రకాశ్‌రాజ్ తన వ్యాఖ్యలతో లెజెండరీ యాక్టర్స్ డాక్టర్ రాజ్‌కుమార్, ఎన్టీఆర్, ఎంజీఆర్‌ను గుర్తుకు తెస్తున్నాడని..అయితే ప్రకాశ్‌రాజ్ కేవలం ఓ సాధారణ నటుడని ప్రతాప్ సింహా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.