ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధ్యక్ష పదవికి ముగాబే రాజీనామా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2017, 08:51 AM

హరారే: సుదీర్ఘకాలం అధ్యక్ష పదవిలో కొనసాగిన రాబర్ట్ ముగాబే ఎట్టకేలకు తన పదవికీ రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ముగాబే రాజీనామా చేసినట్లు జింబాబ్వే పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెండా ప్రకటించారు. 1980లో జింబాబ్వేలో బ్రిటీష్ వలసవాదం ముగిసినప్పటి నుంచి ముగాబే 37 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నారు. గడిచిన వారమే ఆర్మీ తిరుగుబాటు చేసి అధికార పగ్గాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ముగాబేకు వ్యతిరేకంగా రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ప్రజలు సామూహిక నిరసన ప్రదర్శనలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com