ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి విషయాన్నీ లైంగిక వేధింపుగా చూడలేం: ఢిల్లీ హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2017, 11:58 AM

అనుకోకుండా ఓ మహిళను తాకితే దాన్ని లైంగిక వేధింపుగా నిర్దారించలేమని ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఢిల్లీల్లోని సీఆర్ఆర్ఐ (సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) మాజీ శాస్త్రవేత్తపై లైంగిక వేధింపులు జరిగాయని దాఖలైన కేసులో జస్టిస్ విభు భక్రూ విచారణ జరిపి, తీర్పును వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని, ఆరోపణలు వచ్చిన ఉన్నతోగ్యోగి, తన సహోద్యోగినిని తాకిన మాట వాస్తవమేనని, కానీ అప్పటి పరిస్థితుల్లో దాన్ని వేధింపుగా భావించడం లేదని స్పష్టం చేశారు. కంపెనీలు, కార్యాలయాల్లో పని చేసుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పొరపాటున ఒకరిని ఒకరు తాకే అవకాశాలున్నాయని, అంతమాత్రాన ప్రతి విషయాన్నీ లైంగిక వేధింపుగా భావించలేమనని, అయితే, మహిళలపై వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. కాగా, ఏప్రిల్ 2005లో తనను సహోద్యోగి తాకాడని ఆరోపిస్తూ, ఓ మహిళా సైంటిస్టు ఫిర్యాదు చేయగా, ఈ కేసు విచారణకు వచ్చింది. సదరు మహిళ ల్యాబ్ లో పనిచేస్తుంటే వచ్చిన ఉన్నతోద్యోగి చెయ్య పట్టుకుని పక్కకు లాగి, శాంపిల్స్ ను కింద పడేసి, రూము నుంచి బయటకు నెట్టాడు. సదరు అధికారి ఆమె పనిని అడ్డుకున్నాడే తప్ప, లైంగికంగా వేధించలేదని, ఇలా ఫిర్యాదు చేయడం సరికాదని మహిళా సైంటిస్టును న్యాయమూర్తి మందలించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com