ప్రపంచంలో బీఏ.2 ఒమైక్రాన్ వేరియెంట్ ఆవిర్భావం తర్వాత పలు దేశాల్లో కొవిడ్ కేసుల సంఖ్య ఉప్పెనలా పెరుగుతోంది. పలు దేశాల్లో బీఏ.2 ఒమైక్రాన్ స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. యూరప్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. చైనా దేశంలో బీఏ.2 ఒమైక్రాన్ స్ట్రెయిన్ ను అరికట్టేందుకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించింది. చైనాలో ఈ వైరస్ ను అరికట్టేందుకు కఠినమైన లాక్డౌన్లు, సామూహిక కరోనా పరీక్షలు చేస్తున్నారు. షాంఘైలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. షాంఘై నగరం తాజా చైనీస్ కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. అమెరికాలోని మొత్తం కొవిడ్ కేసుల్లో 50 నుంచి 70 శాతం బీఏ.2 అని శాన్ డియాగోకు చెందిన జెనోమిక్స్ సంస్థ హెలిక్స్ అంచనా వేసింది.