ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జొమాటో కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 12:16 PM

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను ఆర్డర్‌ చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ కోసం ఆన్‌లైన్‌ యాప్‌లను అనుసరిస్తున్నారు వినియోగదారులు. ఫుడ్‌ డెలివరీలో స్విగ్గీ, జొమాటోలు దూసుకుపోతున్నాయి. ఇక వినియోగదారులకు కేవలం 10 నిమిషాల్లోపే ఫుడ్‌ను డెలివరీ చేసే జొమాటో ఇన్‌స్టంట్‌ సేవలను త్వరలో ప్రారంభించబోతున్నట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌ వెల్లడించారు. జొమాటో సగటు డెలివరీ సమయమైన 30 నిమిషాలు. అయితే ఇది చాలా ఎక్కువని మేము భావిస్తున్నాము. ఇదే కొనసాగితే సంస్థ వెనుకబడిపోతుంది. పోటీ ప్రపంచంలో వినియోగదారులకు త్వరగా ఫుడ్‌ను అందించడం ఎంతో అవసరం. ఈ రంగంలో మనుగడ సాధించాలంటే స్పీడ్‌గా డెలివరీ చేయడం ఎంతో అవసరమని అన్నారు. అందుకే జొమాటో ఇన్‌స్టంట్‌ను ప్రారంభిస్తున్నాము అని తమ బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవ్వరు కూడా 10 నిమిషాల్లో తాజా ఆహారాన్ని డెలివరీ చేలేదని, ఈ విభాగంలో ఈ ఘటన సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com