ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది. అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ పై సైనిక ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని, ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను వెనక్కి పిలవాలని ఐసీజే బుధవారం రష్యాను ఆదేశించిన విషయం తెలిసిందే.