ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి పల్లె పల్లెకు జనసేన జెండా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 20, 2022, 10:59 AM

పల్లె పల్లెకు జనసేన జెండా అనే కార్యక్రమం ప్రారభమవుతుందని జనసేన పార్టీ కర్లపాలెం మండల అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 5 గంటలకు కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో జనసేన జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారని వెల్లడించారు. కావున బాపట్ల నియోజకవర్గంలో వున్న ప్రతి జనసైనికుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com