ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్‌ కార్డుపై మీ ఫొటో నచ్చలేదా? మార్చుకోండిలా

national |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 04:29 PM

చాలా మందికి ఆధార్‌ కార్డుపై ఉన్న తమ ఫొటో నచ్చదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి ముఖంలో మార్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


- యూఐడీఏఐ (UIDAI) వెబ్‌సైట్‌ (https://uidai.gov.in/) నుంచి ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌/కరెక్షన్‌/అప్‌డేట్‌ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సరైన వివరాలతో ఆ ఫారంను ఫిల్ చేయాలి.


- దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి ఫారంను సమర్పించాలి.


- అక్కడ వారు కొత్త ఫొటోను తీసుకుంటారు.


- మీ బయోమెట్రిక్‌తో వివరాలను వెరిఫై చేస్తారు.


- ఇందుకోసం మీరు రూ.100+ జీఎస్టీ చెల్లించాలి.


- అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌తో పాటు అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌(URN)ను తీసుకోవాలి.


- యూఆర్‌ఎన్‌తో కొన్ని రోజుల తర్వాత మీ అప్‌డేట్‌ స్టేటస్ ని తెలుసుకోవచ్చు.


కొత్త ఫొటోతో మీ ఆధార్‌ అప్‌డేట్‌ కావడానికి గరిష్ఠంగా 90 రోజుల సమయం పట్టొచ్చు. అలాగే ఫొటో అప్‌డేట్‌ చేయడానికి ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అసవరం ఉండదు.


ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ ఇలా..


- UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'డౌన్‌లోడ్‌ ఆధార్‌' ఆప్షన్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి.


- ఆధార్‌ నంబర్‌/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ వర్చువల్‌ ఐడీ నంబర్‌ ను ఎంటర్‌ చేయాలి.


- ఆధార్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకునేముందు అక్కడ ఉన్న క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.


- ఆ తర్వాత సెండ్‌ ఓటీపీ బటన్‌ పై క్లిక్‌ చేసి ఆధార్‌ తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌ లోడ్‌ పై క్లిక్‌ చేయాలి.


- ఆ తర్వాత మీకు పీడీఎఫ్‌ రూపంలో ఆధార్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్‌ ద్వారా వస్తాయి.


- లేదా దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లాలి. యూఆర్‌ఎన్‌ సహా ఇతర వివరాలు చెప్పి ఆధార్‌ కార్డు తీసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com