నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా జగన్ గారు? అబద్ధాలే శ్వాసగా బ్రతికేస్తున్నారు! ఇదిగో మీ ఊళ్లో నాటు సారా బట్టీ. జంగారెడ్డి గూడెం లాంటి పట్టణంలో నాటు సారా కాస్తారా అని అమాయకంగా అడిగారు. ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి.దీనికి ఏం సమాధానం చెపుతారు?ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుండి ఇప్పటి వరకూ 300 కేసులు నమోదయ్యాయి.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంటే ఇక రాష్ట్రంలో సారా మరణాలకి అంతు లేదు అని టీడీపీ నాయకులూ నారా లోకేష్ పోలీస్ వారు పట్టుకున్న సారా దుకాణాలను వీడియో చూపించి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.