అనంతపురం జిల్లా పెనుకొండ జాతీయ రహదారిపై ఓ సైకో సోమవారం రాత్రి హల్ చల్ చేశాడు. హర్యానా కు చెందిన అగంతకుడు చేతి లో కత్తి పట్టుకుని హైవే పై రణరంగం సృష్టించాడు. రహదారి పై వేళ్ళే వాహనదారులు, గోని పేంట రోడ్డు ప్రక్కన ఉన్న ఓ కాలనీ వద్ద మహిళలు ఇబ్బందులు పడ్డారు. కత్తి లాక్కోవడానికి ప్రయత్నం చేసిన స్థానికులపై ఆ సైకో తిరగబడి రాళ్ళు సైతం రువ్వడం జరిగింది. వాహనదారులు హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ లక్ష్మి నారాయణ రెడ్డి కు సైకో సమాచారం అందించడం తో హోంగార్డు విశ్వ తో కలిసి రాత్రి 11 గంటల సమయం లో గాలించారు. జాతీయ రహదారి ప్రక్కన గోనిపేంట రోడ్డు సమీపంలో కత్తి పట్టుకొని నడుచుకొని వెళుతుండగా హైవే పోలీసులు ఆ సైకో ను విచారించగా వారితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కానిస్టేబుల్ లక్ష్మి నారాయణ రెడ్డి, హోంగార్డు విశ్వ లు చాకచక్యంగా అతనిని పట్టుకున్నారు. కత్తి లాక్కుని కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు పై అట్టు ఇటు పరిగెత్తి సైకో చేసిన హంగామా సినీ ఫిక్కీ తరహాలో కనిపించింది. ఇద్దరు హైవే సిబ్బంది ధైర్య సాహసాలతో ప్రవర్తించడం పై స్థానిక కాలనీ మహిళలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేసి ప్రశంసించారు.